లోపాలపై సోదాలు
ఆహార కల్తీని ఉపేక్షించం
రెస్టారెంట్లలో నాణ్యతాలేమి
భీమవరం(ప్రకాశం చౌక్): రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఉదంతంతో జిల్లావ్యాప్తంగా ఆహార తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. పాల కేంద్రా లు, డెయిరీలు తదితర చోట్ల పాలు, వెన్న, నెయ్యి, ఆహార పదార్థాలను తనిఖీ చేసి అనుమానం ఉంటే నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. నా ణ్యతా ప్రమాణాలు పాటించకుండా కొందరు వ్యా పారులు ఆహార కల్తీకి పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు గుర్తించారు.
జిల్లావ్యాప్తంగా.. విస్తృతంగా..
కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. పుడ్ ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్ధశాఖ అధికారులు బృందంగా ఏర్పడి పాల కేంద్రాలు, పాలు, పాలు పర్థారాలు విక్రయించే షాపుల్లో సో దాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ జిల్లాలోని భీమవరం, తణుకులో జరిగిన తనిఖీల్లో ఏడు చోట్ల కల్తీ పాలుగా అనుమానించి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. భీమవరంలోని పాల కేంద్రాల్లో రెండు చోట్ల కల్తీ పాలను గుర్తించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్, డీఎన్‌ఆర్ కాలేజ్ రోడ్డులోని పాల కేంద్రాల్లో పాలు తనిఖీ జరిగినట్టు భావించి నమూనాలను ఏపీ స్టేట్ ఫుడ్ సేప్టీ ల్యాబ్‌కు పంపించారు. అలాగే తణుకులో ఐదు చోట్ల కల్తీ పాలుగా అనుమానించి శాంపిళ్లను సేకరించారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
హాస్టళ్లలోనూ..
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కళాశాలలు, స్కూళ్లలో భో జనం నాణ్యత ఉండటం లేదు. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలు విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదు. భోజనం రుచి, నా ణ్యత ఉండటం లేదని విద్యార్థులు అంటున్నారు. ఇటీవల భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్‌లో భోజనం బాగుండటం లేదని వి ద్యార్థులు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.
భీమవరంలోని పాల కేంద్రంలో తనిఖీలు చేస్తున్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రెడ్డి (ఫైల్)
తణుకులోని ఓ డెయిరీలో ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ రామ్‌కుమార్ (ఫైల్)
జిల్లాలో విస్తృతంగా ఆహార తనిఖీలు
పాలు, నెయ్యి, వెన్న నాణ్యత పరిశీలన
భీమవరం, తణుకులో కల్తీ పాలు గుర్తింపు!
నమూనాలు ల్యాబ్‌కు తరలింపు
హాస్టళ్లలో ఆహార నాణ్యత ప్రశ్నార్థకం
జిల్లాలో విసృత్తంగా ఆహార తనిఖీలు జరుగుతున్నాయి. పాలు, నెయ్యి, వెన్న తదితర వాటిని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, కమిషనర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత శాంపిళ్లను ల్యాబ్‌కు పంపుతున్నాం. తనిఖీలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. జిల్లాలో ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించం. కఠిన చర్యలు తప్పవు.
– సీహెచ్ నాగరాణి, కలెక్టర్
జిల్లాలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారీ, రోజు ల తరబడి మాంసాన్ని నిల్వ చేయడం, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించడం వంటివి జరుగుతున్నాయి. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లోని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో ఇదే పరిస్థితి ఉంది. అలాగే చిన్నపాటి సెంటర్లలో ఉండే హోటళ్లు, బిర్యానీ షాపుల్లోనూ నాణ్యత, శుభ్రత పాటించడం లేదు.
లోపాలపై సోదాలు
లోపాలపై సోదాలు


