ఏలూరు జీజీహెచ్‌లో వైద్యం నిల్
ఏలూరు టౌన్: హనుమాన్‌జంక్షన్‌కు చెందిన పోగోలు మౌనీష్‌కు ఈ నెల 4న ఘర్షణలో తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఏలూరు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. పరీక్షించి తలపై తీవ్ర గాయం కావటంతో 8 కుట్లు వేశారు. సిటీ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తూ.. మందులు, ఇంజెక్షన్లు వాడాలని ప్రిస్కిప్షన్ రాశారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకపోవటంతో వైద్యుల సలహాతో మౌనీష్‌ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్ళి మందులు వాడుతున్నారు. బాధితుడికి వాంతులు కావటం, అనారోగ్యానికి గురికావటంతో స్థానిక వైద్యుల వద్దకు తీసుకువెళ్ళగా జీజీహెచ్‌కు తీసుకువెళ్ళాలని సూచించటంతో ఏలూరు తరలించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకుని సిటీ స్కాన్ రిపోర్ట్‌తో జీజీహెచ్ అత్యవసర విభాగానికి వచ్చారు. న్యూరో సర్జన్‌కు చూపించారు. రిపోర్ట్ ఆధారంగా శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని చెప్పిన వైద్యులు ... జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్‌కు చూపించాలంటూ పంపేశారు. అక్కడకు వెళితే న్యూరో సర్జన్‌కు చూడాలంటూ బాధితుడితో ఆటలాడుకున్నారు. ఆఖరికి వైద్యచికిత్స చేయమంటూ విజయవాడ వెళ్ళాలని చెప్పేశారు. తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌కు వస్తే నరకం చూపిస్తున్నారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ వేచి చూసి చేసేది లేక బాధితుడిని ఇంటికి తీసుకువెళ్ళారు.
విజయవాడ వెళ్ళాలంటూ దాటవేత


