బియ్యం పట్టివేత
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నతపాఠశాల నుంచి అక్రమంగా బియ్యం, నిత్యావసర వస్తువులను వాహనంలో తరలిస్తున్న వార్డెన్‌ను శుక్రవారం అర్ధరాత్రి గ్రామస్తులు, జనసేన నేతలు పట్టుకున్నారు. పోలీసులు, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన అధికారులు వాహనంలో 4 క్వింటాళ్ళ సన్నబియ్యం, కందిపప్పు, మంచినూనె, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వార్డెన్ పరారీలో ఉండటంతో రిజిస్టర్ కనబడలేదు. వార్డెన్ అక్రమాల పై ఉన్నతాధిరులకు నివేదిక అందించారు.


