అప్పుల పండుగ
న్యూస్‌రీల్
ఫైనాన్స్ వ్యాపారుల వద్ద అప్పులు
కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల చినవెంకన్న కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 16న ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. IIలో u
అత్తిలి మండలంలోని బల్లిపాడు గ్రామానికి గతంలో వారంలో బుధ, శనివారాల్లో ఆరుగురు వరకు ఫైనాన్స్ వ్యాపారులు వచ్చేవారు. వీక్లీ, మంథ్లీ పేమెంట్లు చేసేలా అవసరమైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అప్పులు ఇచ్చేవారు. ఏడాది కాలంలో గ్రామానికి వచ్చే వ్యాపారులు 20 మందికి పైగా పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో రెండు రోజులు మాత్రమే వస్తే ప్రస్తుతం వారం పొడవునా వచ్చి అప్పులు ఇస్తున్నారంటున్నారు. ఫైనాన్స్ వ్యాపారం బాగుందన్న ఉద్దేశంతో స్థానికంగాను కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు.
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: గోదావరి జిల్లాల్లో జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడ ఉంటూ స్వస్థలాలకు వచ్చిన వారితో సందడిగా ఉంటుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు, జాతరలు, విహారయాత్రలు, ఇంటికి వచ్చే అల్లుళ్లు, మనవళ్లకు కానుకలు రూపంలో పండగ ఖర్చు ఎక్కువే. అయినా లెక్కచేయకుండా ఏడాదికో పండుగ అన్నట్టుగా ఆనందంగా జరుపుకుంటారు.
సంక్రాంతులు కరువు : సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహనసేవ పథకాల ద్వారా జిల్లావాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలై కార్మికులకు సరిగా పనులు ఉండటం లేదు. విపత్తులు, దళారీల దోపిడీతో తొలకరి పంట నష్టాలనే మిగిల్చింది. ఆయా కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
అధిక వడ్డీలకు.. సాధారణంగా రూ.10 లక్షలలోపు ఫైనాన్స్ చేసే చాలా మంది వ్యాపారులు పెద్ద వ్యాపారుల నుంచి రూపాయి నుంచి రెండు రూపాయల వడ్డీకి (వడ్డీ అడ్జస్ట్‌మెంట్) తెచ్చి బయట పద్దుల రూపంలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు. కొద్ది వారాలుగా మార్కెట్‌లో అప్పులు తీసుకుంటున్న వారు పెరుగుతున్నారని వ్యాపారులు అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వారి సంఖ్య మరింత పెరగడంతో తమ వద్ద డబ్బులు చాలక అదనంగా వడ్డీ అడ్జెస్ట్‌మెంట్‌పై డబ్బులు తెచ్చి ఇస్తున్నారు. పండుగ గడిస్తే చాలు.. మెల్లగా వాయిదాలు కట్టేసుకోవచ్చన్నట్టుగా అధిక వడ్డీలను లెక్కచేయకుండా అప్పులు తీసుకుంటున్నారు. పండుగల రూపేణా జిల్లాలో రూ.100 కోట్ల వరకు ఫైనా న్స్ వ్యాపారం జరుగుతుందని అంచనా. కొన్నాళ్లుగా సరిగా బేరాలు లేక ఖాళీగా ఉన్న క్లాత్ రెడీమేడ్, జ్యూయలరీ, కిరాణా తదితర షాపులు కొద్దిరోజులుగా అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
అవస్థలే నిండుగా..
జాడలేని సంక్షేమం
నిర్మాణ రంగం కుదేలు
డబ్బుల్లేక జనం విలవిల
సంక్రాంతి కోసం అధిక వడ్డీలకు అప్పులు
పాత పద్దులు తిరగేయిస్తున్న మరికొందరు
గ్రామాలకు క్యూ కడుతున్న ఫైనాన్స్ వ్యాపారులు
జిల్లాలో పండుగ ఫైనాన్స్
రూ.100 కోట్లకు పైనే..
ప్రస్తుతం పూటగడవడం కష్టంగానే ఉన్నా ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి పండుగను ఇంటిళ్లపాదీ కలిసి ఆనందంగా జరుపుకోవాలని చాలా మంది ఫైనాన్స్ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం తదితర ప్రాంతాలకు చెందిన స్థానిక వ్యాపారులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులకు జిల్లాలో ఫైనాన్స్ లైన్లు ఉన్నాయి. ఇంట్లోని వారందరికీ కొత్త దుస్తులు, పిండివంటల కోసం కిరాణా సరుకులు, ప్రయాణం, వినోదం ఖర్చుల నిమిత్తం కొందరు, కోడిపందేలు, గుండాట, పేకాటల జూదం కోసం మరికొందరు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో వీక్లీ, మంథ్లీ వాయిదాల్లో తిరిగి చెల్లించేలా అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాత పద్దులుండి కొంతవరకు చెల్లించిన వారు వాటిని తిరగేయించుకుని కొత్త అప్పులు తీసుకుంటున్నారు. కొందరు ఇద్దరు ముగ్గురు వ్యాపారుల వద్ద పద్దులు తీసుకుంటున్నారు.
అప్పుల పండుగ
అప్పుల పండుగ


