అట్టహాసంగా తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొ లుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గో దాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్రవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ గ్రా మోత్సవం నిర్వహించారు. శివాలయం ఆర్చీగేటు వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా వర్షం చినుకులు పడటంతో స్వామివారి వాహనాన్ని వేగంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీంతో ధనుర్మాస మండపంలో నిర్వహించాల్సిన పూజలు రద్దయ్యాయి.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని, 10వ తరగతి ఇన్విజిలేషన్, జవాబుపత్రాల మూల్యాంకన విధులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే నియమించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో డీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 58 ఏళ్లు దాటిన వారందరినీ మూల్యాంకన విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష మాధ్యమం కొనసాగించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఏవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్, ఏలూరు మండల అధ్యక్షుడు కె.దాసు, ముసునూరు మండల గౌరవాధ్యక్షుడు ఎస్‌వీ సుబ్బారావు, మహిళా ఉపాధ్యక్షురాలు కె.కుమారి పాల్గొన్నారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
భీమవరం: ఉపాధి హామీ జీ రామ్‌జీ చట్టం ప్రతులను ఈనెల 14న భోగి మంటల్లో దహనం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బాతిరెడ్డి జార్జి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పాత చట్టంలో 10 శాతం రాష్ట్ర వాటా కాగా కొత్త చట్టంలో 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఒకపక్క 125 రోజులకు పనులు పెంచామని చెబుతూ మరోపక్క 60 రోజుల నిషేధం విధించడం ఉపాధి కూలీలను మోసగించడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చేనెల 12న దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు కౌ రు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు బల్ల చినవీరభద్రరావు, జక్కంశెట్టి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ప్రసాదాల కౌంటర్ వద్ద నిమ్మకాయలు విక్రయిస్తున్న ఓ మహిళా వ్యాపారిపై దేవస్థానం సెక్యూరిటీ సూపర్‌వైజర్ శనివారం కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. ద్వారకాతిరుమల క్షేత్రంలోని లింగయ్య చెరువు వద్ద, అలాగే కొండపైన జంటగోపురాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద కొందరు మహిళలు నిమ్మకాయలు విక్రయిస్తున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. భక్తులు వి సుగు చెందేలా చేస్తున్నారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఎన్నిసార్లు హెచ్చరించినా వా రిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే కొమ్మరకి చెందిన మానుకొండ సో మాలు అనే మహిళ నిమ్మకాయల విక్రయిస్తుండగా సెక్యూ రిటీ సూపర్‌వైజర్ ప్రవీణ్ కర్రతో కొట్టాడు. ఆమె మోచేతికి స్వల్ప గాయమైంది. సదరు సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోవాలని బా ధితురాలు అంటోంది.
అట్టహాసంగా తిరువీధి సేవ


