ఏలూరు వైఎస్సార్‌సీపీలో జోష్
ఏలూరు టౌన్: ఏలూరు వైఎస్సార్‌సీపీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఏలూరు సమన్వయకర్త మా మిళ్లపల్లి జయప్రకాష్ సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు నెలలపాటు టీడీపీ పాలనలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఇక నూతన సంవత్సరంలో పార్టీలో మరింత జోష్‌తో ముందుకు సాగుతోంది. ఏలూరు నగరంలోని 24వ డివిజన్ నుంచి యువత వైఎస్సార్‌సీపీలో చేరటంతో పాటు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత గ్జేవియర్ మాస్టర్, ఆర్‌టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కుల బెనర్జీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువతకు పార్టీ కండువాలు వేస్తూ సమన్వయకర్త జేపీ సాదరంగా ఆహ్వానం పలికారు. టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని సమన్వయకర్త జేపీ అన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుకోవాలనీ, ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.


