వైఎస్సార్‌సీపీలో చేరికలు
కుక్కునూరు: గత వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అందించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. శనివారం మండలంలోని మారేడుబాక గ్రామానికి చెందిన ఏడుగురు టీడీపీని వీడి పంచాయతీ కన్వీనర్ దాడి వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్, రావు వినోద్‌లు పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు జగన్ నాయకత్వాన్ని మెచ్చి వచ్చారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని, టీడీపీ అసమర్థ పాలనే ఇందుకు కారణమన్నారు. గంటశాల దుర్గాప్రసాద్, గోలి సందీప్, గంటశాల నాగరాజు, మిడి యం లక్ష్మయ్య, మడెం లక్ష్మయ్య, కారం తిరుపతిరావు, మడకం యర్రయ్య తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గొగ్గులోతు సత్యనారాయణ, రాయి బాలాజీ, వేల్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


