పందెం బరుల ధ్వంసం
నూజివీడు/చాట్రాయి: నూజివీడు మండలం, పట్టణంలో ఏర్పాటుచేసిన పలు కోడిపందేల బరులను పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని పాతరావిచర్లలో బరిలో ఎస్సై జ్యోతీబసు సిబ్బందితో కలిసి ట్రాక్టర్‌తో దున్నించడంతో పాటు స్తంభాలను, ఫెన్సింగ్‌ను తొలగించారు. అలాగే నూజివీడులోని గొడుగువారిగూడెంలో పందేల బరిని టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
చాట్రాయి మండలంలో..
చాట్రాయి: మండలంలోని కృష్ణారావుపాలెంలో కోడిపందేల బరిని నూజివీడు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్సై డి.రామకృష్ణ పాల్గొన్నారు.
పందెం బరుల ధ్వంసం


