వేగంగా పాస్‌బుక్‌ల పంపిణీ
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): జిల్లాలో పట్టాదార్ పాస్‌బుక్‌లను రై తులకు వెంటనే అందించా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 9,134 పాస్‌బుక్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో ఏలూరు డివిజన్‌లో 5,501, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 3,614, నూజివీడు డివిజన్‌లో 90 ఉన్నాయన్నారు. అధికంగా కలిదిండి మండలంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కై కలూరు, దెందులూరు, పోలవరం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న పాస్ పుస్తకాలను వేగంగా పంపిణీ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.


