భాగవతోత్తముడు త్యాగరాజు
భీమవరం: త్యాగరాజు 96 కోట్ల నారాయణ జపం చేసి శ్రీసీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవతోత్తముడని మహా సహస్రావధాని గరికిపాటి నర్సింహారావు అన్నారు. భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం గరికిపాటి త్యాగరాజు రామాయణంపై ప్రవచనం చేశారు. దేశమంతా మోగుతున్న నినాదం జై శ్రీరామ్ నామ మంత్రమని, నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. శ్రీరామ దర్శనం పొంది భగవంతుడున్నాడన్న సత్యాన్ని చాటిన నిష్కార్మయోగి, తెలుగు భాష తీయందనాన్ని, సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన ధన్యజీవి, మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని తలచి తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అంటూ కీర్తించారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ పనులన్నీ 2027 మార్చికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ సైట్‌లోని సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించాలని సూచించారు. మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.


