జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
భీమడోలు: మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన 68వ జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిఫ్‌లో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు ధరియా జూనియర్ కేటగిరిలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ ఏడాది చివరిలో జరిగే నేషనల్స్ పోటీల్లో విజేతగా నిలిస్తే ఇండియన్ టీంలో స్థానం పొందుతుందని తండ్రి సోము తెలిపారు. చిన్నతనం నుంచి షూటింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుని, అలుపెరుగని శ్రమతో తన లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న ధరియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మాజీ సర్పంచ్ వెజ్జు సూర్యకుమారి, కొండలరావు మనవరాలు ధరియా గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు.
పెదపాడు: రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తిరుపతి జిల్లా, నారాయణ వనం మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన కుంభ విజయ్ ఈనెల 6వ తేదీన తన మోటారు సైకిల్‌పై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకి బలమైన గాయం కావడంతో జాతీయ రహదారి అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో రాగాల కృష్ణ ఫిర్యాధు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


