క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జైత్ర 2026 పేరిట నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కార్నివాల్‌కు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో 100 టీంలు పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తి, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ సీహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు పాల్గొన్నారు.


