నాణ్యమైన పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన పరిష్కారం చూపాలి

Jan 6 2026 7:30 AM | Updated on Jan 6 2026 7:30 AM

నాణ్యమైన పరిష్కారం చూపాలి

నాణ్యమైన పరిష్కారం చూపాలి

ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందే అర్జీలకు న్యాయమైన పరి ష్కారం చూపాలని జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ అ న్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఆగంగా డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్‌, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ ఎల్‌.దేవకీదేవి, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్‌లో భాగంగా జిల్లాలో 28 మండలాలకు సంబంధించి 28 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, వినతులు స్వీకరించామన్నారు.

అర్జీల్లో కొన్ని..

● అప్పనవీడుకి చెందిన కనికిచర్ల కుమార్‌బాబు ఎన్‌హెచ్‌–16 విస్తరణలో భాగంగా డ్రెయినేజీ స మస్య ఇబ్బంది పెడుతోందని అర్జీ అందించారు.

● ఏలూరులోని శాంతినగర్‌కు చెదిన కట్నేని వెంకట గోపాలకృష్ణ తన 3.16 సెంట్లను భూసేకరణ చేశారని, అయితే ఇప్పటివరకూ నష్టపరిహారం రాలేదన్నారు. భూసేకరణ నుంచి తన భూమికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

● కామవరపుకోటకి చెందిన పోపూరి శ్రీనివాసు ఆయిల్‌పామ్‌ మొక్కల సబ్సిడీ సొమ్ములకు వినతిపత్రం అందించారు.

● పెనుమల్లి నివాసి వీరమల్లు పెదకొండలరావు గ్రామం మధ్యలో డ్రైనేజీ కాలువకు ఆనుకుని ఆ క్వా ప్రాసెసింగ్‌ యూనిట్లతో పర్యావరణ కా లుష్యం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement