విధుల్లో అలసత్వం సరికాదు
ఏలూరు టౌన్: పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, విధుల్లో అలసత్వం సరికాదని జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 41 ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజలు తమ సమీపంలోని డీఎస్పీ, సీఐ కార్యాలయాలకు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఆన్‌లైన్‌లో మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌లోనూ సంప్రదించవచ్చన్నారు. ప్రజలు సైబ ర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సత్యసాయి సేవా సంఘం స భ్యులు బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు.


