తీరని చింత
ప్రభుత్వం దృష్టి పెట్టాలి
పథకంతో మాకెంతో ప్రయోజనం
బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంత వరప్రదాయినిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పలనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పథకం ప్రారంభమై 17 ఏళ్లు కావొస్తున్నా పలు దశల్లోనే పనులు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 19 నెలలు కావస్తున్నా కనీసం పనులను కన్నెత్తి చూడటం లేదని రైతులు అంటున్నారు.
2009లో శ్రీకారం : 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో సుమారు రూ.1,708 కోట్ల అంచనాలతో చేపట్టారు. మొదట్లో పనులు వేగంగా జరిగినా వైఎస్సార్ అకాల మరణంలో మందగించాయి. 2017లో టీడీపీ హయాంలో రూ.4,909 కోట్లతో ఫేజ్–2 పనులు చేపట్టారు. అయితే అవి కూడా కొంత మేర జరిగి నిలిచిపోయాయి. 2019లో వైఎస్సార్‌సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బకాయిల చెల్లింపు, పనులను వేగవంతం చేశారు. అయితే కోవిడ్ తర్వాత పనులు ముందుకు సాగలేదు. అలాగే భూసేకరణ సమస్యలతో కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి. జగన్ హయాంలో నాబార్డు నుంచి పథకానికి రూ.1,930 కోట్లు మంజూరు చేశారు.
33 మండలాలలకు ప్రయోజనం..
పథకం పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరితోపాటు కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 33 మండలాలు, 410 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఉమ్మడి పశ్చిమలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని 2.80 లక్షల ఎకరాలకు మొత్తం 4.80 లక్షల ఎకరాలకు నీరందుతుంది. గోదావరి నుంచి 6,870 క్యూసెక్కుల నీరు చొప్పున 90 రోజులపాటు 53.50 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చని అధికారులు చెబుతున్నారు.
జల్లేరు.. అదే తీరు : బుట్టాయగూడెం–జీలుగుమిల్లి మండలాల మధ్య సుమారు రూ.470 కోట్ల వ్యయంతో జల్లేరు రిజర్వాయర్ పనులను చేపట్టారు. ఇక్కడ 14 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వ కింద ఉండే 2.80 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వయోడక్ నిర్మాణం ప్రాంతం పిచ్చిమొక్కలతో కనిపిస్తుంది. అలాగే కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలు, జల్లేరు రిజర్వాయర్ పనుల పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
నిలిచిన చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు
కన్నెత్తి చూడని చంద్రబాబు ప్రభుత్వం
గత ప్రభుత్వంలో రూ.1,931 కోట్ల మంజూరు
జల్లేరు రిజర్వాయర్ పనులలోనూ అలసత్వం
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలి. ఎన్నికలకు ముందు పలుమార్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఎందుకు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా దీనిపై దృష్టి పెట్టాలి.
– తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం
చింతలపూడి పథకం పూర్తయితే మాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇటు సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తాయి. భూగర్భజలాలు పెరగడం వల్ల పంటలకు పుష్కలంగా నీరు అందుతుంది. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
– కోర్సా బాలకృష్ణ, గిరిజన రైతు, బెడదనూరు
తీరని చింత
తీరని చింత
తీరని చింత


