రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
పెనుమంట్ర: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు దంపతులు ఆదివారం సాయంత్రం పెనుమంట్ర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన నత్త రామేశ్వరంలోని ఉమా రామలింగేశ్వర స్వామిని, జుత్తిగలో సోమేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెల్ల ధనుంజయ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ద్వారకాతిరుమల : గోవిందా.. గోవిందా.. అంటూ శ్రీవారి భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో క్షేత్ర పరిసరాలు ఆదివారం మార్మోగాయి. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
పెదవేగి: మహిమ గల తల్లి శ్రీ రాట్నాలమ్మకు భక్తులు విశేష రీతిలో పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి దేవస్థానానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుం వల్ల రూ.18,100, విరాళంపై రూ.4,622, లడ్డూ ప్రసాదంపై రూ.9,975, పులిహోర ప్రసాదంపై రూ.690, ఫొటోల అమ్మకంపై రూ.1,890, మొత్తం రూ.35,277 ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్ కుమార్ తెలిపారు.
కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిళలు అమ్మకు పాలపొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గధుల అద్దెలు, చిత్రపఠాలు అమ్మకం, వాహన పూజలు, విరాళాలు కలపి రూ.19,426 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏలూరులో జరిగాయి. శ్రీధర్ రాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా హెచ్.గోపాలకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి


