మళ్లీ రోడ్డెక్కిన చెత్త సమస్య
నరసాపురం: నరసాపురంలో చెత్త డంపింగ్ సమ స్యను ఎమ్మెల్యే గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో చెత్త డంపింగ్ విషయంలో రోజుకో ఉద్రిక్తత తలెత్తుతోంది. తాజాగా చెత్తను పట్టణంలో మార్కెట్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పార్కు రోడ్డులోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద డంప్ చేయడం మొదలుపెట్టారు. అక్కడున్న ము న్సిపల్ చేపల మార్కెట్ భవనం వద్ద చెత్తను వేయడంతో శనివారం స్థానికులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ షాన్‌వాజ్‌ఖాన్, బూసరపు జయ తదితరులు మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా షాన్‌వాజ్‌ఖాన్ మాట్లాడుతూ ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉన్నచోట చెత్తను వేస్తే స్థానికులు ఎలా బ తుకుతారని ప్రశ్నించారు. చెత్తను పార్కు రోడ్డులో డంప్ చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వాటర్ ట్యాంక్ ఏరియాలో..
12వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ సఖినేటిపల్లి సురేష్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. 18 వార్డులకు నీటిసరఫరా చేసే ట్యాంకర్ ఉన్నచోట చెత్త ఎలా వేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషన ర్ ఆదేశాలతోనే ఇక్కడ వేస్తున్నామని చెప్పడంతో సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మొత్తంగా మున్సిపాలిటీలో చెత్త సమస్య జటిలమవుతోంది.
నరసాపురం పార్కు రోడ్డులో ఉద్రిక్తత


