ఈవీ.. పట్టించుకోరేమీ?
నూజివీడు: పట్టణంలోని ఇరుకు సందుల్లో నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందు కు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందించిన ఈ వీ ఆటోలు మూలకు చేరాయి. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)లో భాగంగా అందించిన ఆరు ఈవీ ఆటోలు మున్సిపాలిటీ అలసత్వం, నిర్వహణలోపం కారణంగా మరమ్మతులకు గురవడంతో పక్కన పెట్టేశారు. బ్యాటరీలు పనిచేయకపోవడంతో అ లాగే వదిలేశారు. సప్లయి చేసిన కంపెనీ సైతం సర్వీసు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. వీటికి చార్జింగ్ ఎక్కుతున్నా వాహనం కదలడం లేదంటూ గాంధీపార్కు పక్కనే ఉన్న మీసేవా కేంద్రం భవనం ఆవరణలో పెట్టారు. విద్యుత్ ద్వారా నడిచే ఈ వాహనాల ద్వారా మున్సిపాలిటీపై ఆర్థిక భారం తగ్గుతుంది. వీటిని రన్నింగ్‌లో పెట్టకపోవడంపై పలువురు కౌన్సిలర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


