నడిరోడ్డుపై పడిగాపులు
జంగారెడ్డిగూడెం: మండలంలోని దేవులపల్లిలో శుక్రవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. భీమవరం డిపోకు చెందిన బస్సు జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్తున్న క్రమంలో దేవులపల్లి సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపై మరో బస్సు కోసం ఎదురుచూడాల్సిన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులతో పాటు, కండిషన్ సరిగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.


