జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో ఫార్మసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇరపా అమ్మాజీ కిరణ్ యోగాసన పోటీల్లో ప్రతిభ చాటారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు మహారాష్ట్రలో సంగమనేరు ధ్రువ గ్లోబల్ స్కూల్‌లో పోటీలలో ఐదో స్థానం సాధించారు. అమ్మాజీ రాష్ట్రస్థాయి పోటీలలో గతంలో బంగారు పతకం సాధించిదింద. అమ్మాజీ మాట్లాడుతూ యోగా మానసిక, శారీరక రుగ్మతలకు చక్కటి పరిష్కారమని, యోగా ప్రతి ఒక్కరికి జీవన విధానంగా మారాలని అన్నారు. అంతర్జాతీయ పోటీల్లో కూడా ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్ర వీధులకు పయనమైంది. గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. అనంతరం ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి సేవ రాత్రి వైభవంగా నిర్వహించారు.
చింతలపూడి: చింతలపూడి మండలం పట్టాయిగూడెం, ఊటసముద్రం గ్రామాల్లో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.28,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాల మేరకు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. పట్టాయగూడెంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.16,800 నగదు, ఊటసముద్రంలో 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.11,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై సతీష్ కుమార్ మాట్లాడుతూ పేకాట, కోడి పందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
తణుకు అర్బన్ : రైలు ఢీకొట్టి వృద్ధుడు మృతిచెందిన ఘటన తణుకు రైల్వే అవుట్ పోస్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం కోనాలకు చెందిన సనమండ్ర గాంధీ(60) కొబ్బరికాయల దింపు కార్మికుడుగా పనిచేసేవాడు. పదేళ్ల క్రితం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో వైద్యులు కుడి చేయి తొలగించారు. అప్పటి నుంచి కొబ్బరికాయలు కొని, అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వచ్చిన గాంధీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఉదంతంతో గుర్తించిన కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.
జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ


