ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్య శాఖలోని ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గురువారం భీమవరంలో రాష్ట్ర ఆరోగ్య ఎంపీఈఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుడాల హరిబాబు అధ్యక్షతన ఎన్నిక జరిగింది. సంఘ అధ్యక్షుడిగా కడలి శాంతమూర్తి, సహ అధ్యక్షుడిగా జి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జె.సత్యనారాయణ, పి.సుకుమార్, పి.ప్రభాకర్, జనరల్ సెక్రటరీగా ఏఎస్‌ఎన్ మూర్తి, జా యింట్ సెక్రెటరీగా సీహెచ్ సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా యు.ప్రసాద్, ట్రెజరర్‌గా కె.అప్పారావు, ఈసీ మెంబర్లుగా ఎస్వీఎస్ ప్రసాద్, ఎం.ఫాల్‌సన్‌ను ఎన్నుకున్నారు.


