అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ | - | Sakshi
Sakshi News home page

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ

Jan 2 2026 11:15 AM | Updated on Jan 2 2026 11:15 AM

అల్లు

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ అంజన్నకు విశేష పూజలు జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక శ్రీవారి ధనుర్మాసోత్సవం సీనియర్‌ జర్నలిస్ట్‌కు తీవ్ర గాయాలు

భీమడోలు: అల్లుడి బైక్‌ను మామ పెట్రోలు పోసి దహనం చేసిన ఘటన గురువారం రాత్రి పెదలింగంపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిరుదుగడ్డ బాబూరావు తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన కొండా సుబ్బారావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా రెండేళ్ల కితం సుబ్బారావు తన భార్యను పుట్టింటికి పంపించి వేయడంతో ఆమె పుట్టింటిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పలుసార్లు తన కుమార్తెను కాపురానికి తీసుకువెళ్లాలని అల్లుడిని మామ బాబూరావు కోరాడు. నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మామ తన అల్లుడి ఇంటి వద్ద ఉన్న బైక్‌ను పెట్రోలు పోసి దహనం చేశారు. దీంతో సుబ్బారావు భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెం: నూతన సంవత్సరం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.3,97,450 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. స్వామివారిని బిగ్‌బాస్‌ సీజన్‌ 9 సెకండ్‌ రన్నరప్‌ డెమోన్‌ పవన్‌ దర్శించుకున్నారు.

నూజివీడు: జాతీయస్థాయి సీనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బేతాళ ప్రభుదీపిక, షేక్‌ ఆస్రా చైన్నెలో ఈనెల నాలుగో తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని నూజివీడు డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్‌, పరిపాలనాధికారి లక్ష్మణరావు, డీన్‌ అకడమిక్స్‌ సాదు చిరంజీవి, పీడీ సుబ్బలక్ష్మి అభినందించారు.

ద్వారకాతిరుమల: క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. నిత్యం ఆలయంలో సుప్రభాత సేవకు బదులు, తిరుప్పావై పాశురాలను పఠిస్తున్నారు. అలాగే స్వామివారి గ్రామోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉదయం జరిగిన శ్రీవారి తిరువీధి సేవ ఆదం్యతం భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, హారతులిచ్చారు.

పెనుమంట్ర: ప్రభుత్వ ఆదేశాల పుణ్యమా అని ఒక సీనియర్‌ జర్నలిస్టుకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం అర్ధరాత్రి పెనుమంట్ర తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉన్న బ్రాందీ షాపు ఎదురుగా జరిగింది. పొలమూరు గ్రామానికి చెందిన వేండ్ర ప్రసాద్‌ ఏలూరులోని ప్రజాశక్తి కార్యాలయంలో డెస్క్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి తన విధులను ముగించుకొని మోటార్‌ సైకిల్‌పై పొలమూరు గ్రామానికి తిరిగి వస్తుండగా పెనుమంట్రలోని స్టేట్‌ హైవే రోడ్డు పక్కనే ఉన్న బ్రాందీ షాపులో మద్యం సేవించి వస్తున్న అదే గ్రామానికి చెందిన జోగి వెంకటేష్‌ అనే వ్యక్తి స్కూటర్‌తో బలంగా ఢీకొట్టాడు. దీంతో ప్రసాద్‌కు తీవ్రంగాను, వెంకటేష్‌కు స్వల్పంగాను గాయాలయ్యాయి. ఇరువురిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రసాద్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తణుకులోనే మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై ఏ స్వామిని వివరణ కోరగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు.

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ 1
1/2

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ 2
2/2

అల్లుడి బైక్‌ను దహనం చేసిన మామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement