యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన
వేతనాలను పెంచాలని కోరుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. 8లో u
వైఎస్సార్‌సీసీ రైతు విభాగం (ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నా, రైతులు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం (ఆక్వా కల్చర్) వర్కింగ్ ప్రెసిడెంటు వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ.. యూరియా విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాస్తోందన్నారు. మార్క్‌ఫెడ్ వద్ద ఎంత నిల్వలు ఉన్నాయి, ప్రైవేటు డీలర్లకు ఎంత కేటాయించారనే విషయాలను బహిరంగంగా వెలువరించడంలేదన్నారు. సాగు మొదలవ్వకముందే యూరియా కొరత ఎలా ఏర్పడిందని.. నానో యూరియా కొనాలని ఒత్తిడి చేసే డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని విమర్శించారు. డిసెంబర్ చివరి నాటికి 3.93 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనావేస్తే.. ఇప్పటికే 3.23 లక్షల టన్నులు అమ్మినట్టు రికార్డుల్లో చూపించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో యూరియా వాడకం, నిల్వలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలన్నారు. రబీ సీజన్‌కు 5.5 నుంచి ఆరు లక్షల టన్నుల యూరియా అవసరమవగా, ప్రభుత్వం 9.38 లక్షల టన్నుల యూరియా డిమాండ్ ఉన్నట్టు చూపిస్తోందన్నారు. రబీ ప్రాఽథమిక దశలోనే యూరియా కొరత రావడం వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. యూరియా కట్ట కావాలంటే, రూ.450 విలువైన గుళికలు లేదా నానో యూరియా కొనాలని డీలర్లు రైతులను వేధిస్తున్నారన్నారు.


