శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Aug 26 2025 7:44 AM | Updated on Aug 26 2025 7:44 AM

శ్రీవ

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి హుండీ ఆదాయం లెక్కింపు చెత్త తొలగించారు 28న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిబంధనలు పాటించాలి

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ సోమవారం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆ యనకు దేవస్థానం అధికారులు మర్యాద పూ ర్వకంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి, ఏఈఓ పి.నటరాజారావు ఉన్నారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని సోమ వారం లెక్కించారు. శ్రీవారికి విశేష ఆదా యం సమకూరింది. 38 రోజులకు నగదు రూ పంలో రూ.3,61,54,678లు, 261 గ్రాముల బంగారం, 6.834 కిలోల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. అలా గే రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.67 వేలు లభించిందన్నారు.

ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మూడు రోజులుగా రోడ్లపై పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. పారిశుద్ధ్య కార్మికులకు జులై నెల జీతాలు, ఐదు నెలల నుండి పెంచిన జీతాలు ఇవ్వకపోవడంతో వారు మూడు రోజుల నుంచి విధుల్లో పాల్గొనడం లేదు. దీంతో రోడ్లపై చెత్త పేరుకుపోయింది. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘వీధుల్లో ఎక్కడ చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురించగా పంచా యతీ ఇన్‌చార్జి కార్యదర్శి లక్ష్మి స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులతో రోడ్లపై చెత్తను తొలగించారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాల బుధవారం అందిస్తామని, బకాయిలను రెండు నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 28న ఉదయం ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్‌కు వచ్చిన కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని, సంబంధిత సర్టిఫికెట్లు, డీఎస్సీ హాల్‌టికెట్‌ కాపీ, ఆధార్‌ కార్డు, ఐదు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు ముందుగా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఏపీడీఎస్సీ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ 903073444, 905239111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఏలూరు(మెట్రో) : వినాయకచవితి ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్విఆదేశించారు. వినాయకచవితి ఉత్సవాలు, ఎరువులు సరఫరా అంశాలపై కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె సమీక్షించారు. బాణాసంచా అనధికార నిల్వలపై ప్రత్యేక ని ఘా పెట్టాలన్నారు. జిల్లాలో ఎవరైనా యూరి యా ఎరువులు, డీఏపీ అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు.

అర్హులెవరికీ పెన్షన్‌ తొలగించరు

అర్హులైన దివ్యాంగులు ఎవరికీ పింఛన్లు తొలగించరని కలెక్టర్‌ అన్నారు. తమకు నోటీసులు అందాయని దివ్యాంగులు కలెక్టర్‌ వద్ద బోరుమనగా విచారణ చేసి అర్హులకు యథాతథంగా పింఛన్లు ఇస్తామన్నారు

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి 1
1/3

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి 2
2/3

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి 3
3/3

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement