
పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 411 అర్జీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ యం.అచ్యుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● ఏలూరు మండలం పత్తేబాద వృద్ధాశ్రమం నివాసి గంధం అంజయ్య తన కాలుకు ఆపరేషన్ చేయించుకునేందుకు సహకారం అందించాలని కోరారు.
● మండవల్లి మండలం అల్లినగరం చెందిన జుజ్జవరపుపాల్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. తనకు కొన్ని నెలలుగా జీతం రావడం లేదని, పరిష్కారం చూపాలని అర్జీ అందించారు.
● చింతలపూడి మండలం యర్రగుంటపల్లి చెందిన కొల్లి నర్సారెడ్డి తమ గ్రామంలోని 9వ వార్డులో డ్రెయిన్లు లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
● కై కలూరు మండలం ఆటపాక చెందిన తోట శ్రీనివాస నాయుడు తమ రహదారికి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉన్నాయని తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
● కలిదిండి మండలం మూలలంకకు చెందిన ఎస్‌ఎన్‌వీ సత్యనారాయణ తమ గ్రామంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు.