
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దుర్మార్గం
కామవరపుకోట: ఎలాంటి ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న దివ్యాంగుల పింఛన్లు తొలగించం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పింఛన్ల తొలగింపునకు నిరసనగా మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన ర్యాలీ నిర్వహించారు. మండలవ్యాప్తంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్థానిక కొత్తూరు బంగ్లా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన తెలిపి ఏఓ సత్యవేణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తీసివేసి వారి ఉసురు కట్టుకుందన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను నిలువునా మోసం చేసిందన్నారు. ఇది హేయమైన చర్య అని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజయరాజు డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీలు తమ్మిశెట్టి గిరిజ, కనికెళ్లి రత్నకుమారి, ఎంపీటీసీలు బొల్లు సత్యనారాయణ, మేడంకి పద్మావతి, కనుమూరి అంజిరెడ్డి, ఉప్పలపాటి సాయిబాబు, మహ్మద్ కరీముల్లా, దేవరపల్లి రామ్మోహన్‌రావు, సాయిన కనక రాజు, గుర్రాల రవికుమార్ నారాయణరాజు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు కె.రామకృష్ణ, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి, నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చొక్క నాగరాజు, రుద్రపాక నాగ మల్లేశ్వరావు, కనుమూరి ప్రసాద్ రెడ్డి, ఘంటా భాస్కారావు, టౌన్ ప్రెసిడెంట్ నానాది సాగర్, అంకాలపాడు, ఉప్పలపాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.