
హెచ్‌ఎంల సంఘ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘ భవనంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా వడ్లపట్ల మురళి, ప్రధాన కార్యదర్శిగా జంగం రవీంద్ర, కోశాధికారిగా బుర్ర శ్రీధర్, గౌరవాధ్యక్షుడిగా గారపాటి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లుగా వి.శ్రీనివాసరావు, ఆర్.శైలజ, వి.హరి సీతారామయ్య ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎ.సర్వేశ్వరరావు, హెడ్ క్వార్టర్ సెక్రటరీగా పి.సురేష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎల్‌సీ కేశవరావు వ్యవహరించారు. జిల్లాలో ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వము, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించి, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు తీర్మానించారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని భూ సమస్యలపై సోమవారం కలెక్టర్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్టు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. భూ సమ స్యలు ఎదుర్కొంటున్న గిరిజనులు, దళితులు, పేదలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల సమస్యలను పరిష్కరించాలని, గిరిజనులు, దళితులు, పేదలకు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నామన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆదివారం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
నరసాపురం: నిబద్ధత, అంకితభావంతో పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ న్యాయవాదులకు సూ చించారు. ఆదివారం నరసాపురం వచ్చిన ఆయన న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. రోజురోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు తమ న్యాయ పరి జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. న్యాయవాదులు న్యాయపరమైన అంశాలపై, చట్టాలపై, న్యాయశాస్త్ర సూత్రాల పై చర్చా వేదికలు నిర్వహించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. న్యాయస్థానాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ న్యాయస్థానాలు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసి విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి ఎ. వాసంతి, సీనియర్ సివిల్ జడ్జి జి.గంగరాజు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఆర్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ జీవితంలో సైక్లింగ్‌ను భాగంగా చేసుకోవా లని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వాహనాల వాడకంతో కాలుష్యం పెరుగుతుందని, పరిష్కారంగా సైకిల్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. గుండె సంబంధిత రోగాల నివారణ, మధుమేహ నియంత్రణ, ఒత్తిడిని తగ్గించడం, శరీర బరువు నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సైక్లింగ్ ద్వారా చేకూరుతాయన్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పెద అమిరం ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు సైకిల్‌పై ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీ వి.భీమారావు తదిత రులు పాల్గొన్నారు.

హెచ్‌ఎంల సంఘ కార్యవర్గం ఎన్నిక