
న్యాయం గెలిచింది
చాటపర్రు సర్పంచ్ గుడిపూడి రఘు అక్రమ అరెస్ట్, రిమాండ్ విషయంలో న్యాయం గెలిచింది. అక్రమ కేసులు, అరెస్ట్‌లు ఎన్నటికీ నిలబడవు. అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటాం.
– తేరా ఆనంద్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు
పోలీసుల తీరు మారాలి. న్యాయస్థానాలు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేసి మెమోలిస్తున్నా ఒకే విధానంలో కే సులు నమోదు చేయడం బాధాకరం. పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి.
– అప్పన ప్రసాద్, దెందులూరు ఏఎంసీ మాజీ చైర్మన్
మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ య్యచౌదరి తోటల్లోకి టీడీపీ శ్రేణులు అక్రమంగా చొరబడ్డారు. పంటను నష్టపరిచి, దాడులు చేశారు. తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులపైనే కేసులు పెడుతున్నారు. ఇదేం పాలన.
– బత్తుల యేసు రాజు, వైఎస్సార్‌సీపీ పెదపాడు మండల నేత
టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలను ప్రజలంతా గమనిస్తున్నారు. అధికారం ఉంటే ఎదుటివారిపై అక్రమ కేసులు బనాయిస్తారా. గతంలో మేం ఎవరి తోటల్లోకైనా వెళ్లామా, దాడు లు, దౌర్జన్యాలు చేశామా.
– అక్కినేని రాజశేఖర్, పెదపాడు సొసైటీ మాజీ చైర్మన్

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది

న్యాయం గెలిచింది