
గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి
పెదఎడ్లగాడి వంతెన వద్ద యుద్ధప్రాతిపాదికన గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టాం. పెదఎడ్లగాడి వద్ద 2.5 అడుగుల నీటిమట్టం ఉంది. ఇది 4 అడుగుల దాటితే గ్రామాలకు నీరు చేరుతుంది. గుర్రపుడెక్క తొలగించడం వల్ల నీరు కిందకు వెళుతుంది.
–ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు
ఏలూరు డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్సు బృందాలను కొల్లేరు పరీవాహక గ్రామాల వద్ద గస్తీకి ఉంచాం. ఎటువంటి విపత్తులు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరు అంత ప్రమాదంగా లేదు. డ్రోన్‌లతో పర్యవేక్షిస్తున్నాం.
– వి.రవికుమార్, రూరల్ సర్కిల్ సీఐ, కై కలూరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/కైకలూరు/పోలవరం/కుక్కునూరు: ఓ వైపు గోదావరి ఉధృతం.. మరోవైపు ప్రధాన కాలువల నుంచి కొల్లేరుకు భారీగా వచ్చి చేరుతున్న నీటితో ఏలూరు జిల్లాను వరద చుట్టుముడుతోంది. ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో గోదావరి, కొల్లేరు నీరు చేరడంతో లంక, ముంపు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడన ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, శబరి నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రోజుల్లో మొత్తంగా 9 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరింది. సోమవారం భద్రాచలం వద్ద 38 అడుగుల మేర నీటిమట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 31.050 మీటర్ల ఎత్తు నుంచి 6,70,355 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 48 గంటల పాటు వరద ఉధృతి కొనసాగి మంగళవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. గోదావరి, శబరికి ఎగువ నుంచి 15 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటి ప్రవా హం కొనసాగుతుందని అంచనా.
ముంపు మండలాల్లో..
వేలేరుపాడు మండలంలోని కొయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్ల గొంది,పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రారెడ్డిగూడెం, ఎర్రమెట్ట, ఎడవల్లి, చిట్టం రెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగి పోయాయి. ఎద్దుల వాగు వంతెన నీట మునగడంతో నాటు పడవ ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసి ఐదు గ్రామాల ప్రజలను తరలించడంపై అధికారులు దృష్టి సారించారు. కుక్కునూరులో గుండేటివాగు వంతెన నీటముగింది.
పెనుమాకలంకకు రాకపోకలు బంద్
మండవల్లి మండలం పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక, నందిగామలకం, ఇంగిళిపాకలంక గ్రామాలకు చేరే రహదారిపై మూడు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. పెదఎడ్లగాడి నుంచి పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పెనుమాకలంక రహదారి వద్ద ప్రవేశం లేదని పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. మండవల్లి మండలంలో పులపర్రు, కొవ్వాడలంక, మణుగునూరులంక, తక్కెళ్లపాడు, చింతపాడు గ్రా మాలు, కై కలూరు మండలంలో పందిరిపల్లిగూడెం, కొట్డాడ, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామా లు నీట మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క
కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ప్రధా న పెదఎడ్లగాడి వంతెనకు 56 ఖానాలకు గాను 20 ఖానాల్లో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పొక్లెయిన్ తో డెక్కను తొలగిస్తున్నారు. గుర్రపుడెక్క పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కొల్లేరు పరీవాహక ప్రజలు కోరుతున్నారు. డెక్కతో పచ్చటి తివాచీ పరుచుకున్నట్టు కొల్లేరు కనిపిస్తోంది.
పెద ఎడ్లగాడి వంతెన వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులు
మండవల్లి మండలంలో నీట మునిగిన పెనుమాకలంక రహదారి
జిల్లాను చుట్టుముడుతున్న వరద
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు నుంచి కొల్లేరులోకి నీరు
పెనుమాకలంకకు రాకపోకలు బంద్
వేలేరుపాడులో ముంపులోనే ఎద్దులవాగు వంతెన
పోలవరం నుంచి 6.70 లక్షల క్యూసెక్కులు దిగువకు..

గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి

గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి

గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి

గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి