
●బండి కాదు.. మొండి
ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కామవరపుకోట మండలం కొత్తూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రభుత్వం ఉచిత బస్సు అంటూ కాలం చెల్లిన బస్సులు తిప్పడమేంటని మహిళలు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఎంత తోసినా బస్సు ముందుకు కదలకపోవడంతో చేసేది లేక, అక్కడే వదిలిపెట్టి, ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు.
– కామవరపుకోట