
● విద్యార్థులతో మట్టి చాకిరీ
● అంతర్రాష్ట్ర బస్సుల్లో అనుమతి నిరాకరణ
● 63 రూట్లకే ఉచితం పరిమితం
● కండిషన్‌లో లేని బస్సుల్లో ప్రయాణంపై ఆందోళన
తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని ఉద్యా న వర్సిటీలో డిప్లమో హార్టీకల్చర్, డిప్లమో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత స్పాట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నాలుగు ప్రభుత్వ, మూడు గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గతంలో దరఖాస్తు చేసుకున్నా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యాన వర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా హాజరుకావాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జరిగే మీట్ ఎట్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి నాగేంద్ర సింగ్ ఎంపికయ్యారు. నాగేంద్రసింగ్ ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని ఎంపీయూపీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్‌గా కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొని గవర్నర్ నుంచి సన్మానం అందుకోనున్నారు.
హాస్టల్ ప్రాంగణాన్ని మట్టితో చదును చేస్తూ..
చెత్తను ఏరుతూ..
చెత్తను కాల్చుతున్న విద్యార్థులు
ఉచిత ప్రయాణానికి కొర్రీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నికల హామీ ఉచిత బస్సు ప్రయాణం శుక్రవారం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ప్రతిపక్షాలు, మహిళల నుంచి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక నిర్ణయం తీసుకోక తప్పలేదు. రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకూ ఉచితంగా బస్సు ప్రయాణమని చెప్పిన సర్కారు ఇప్పుడు అనేక ఆంక్షలు పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేశాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఏడాదిన్నరకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అన్ని బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించేలా అనుమతులిచ్చారు. రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్ర యాణమంటూ పెద్ద బాంబు పేల్చారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి మొత్తం 309 బస్సులు నిత్యం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ బస్సుల్లో మహిళలు ఎక్కడానికి 177 బస్సుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఉచిత బస్సు ప్రయాణంలో విధించిన కొర్రీల్లో భాగంగా జిల్లా మహిళలకు అంతర్రాష్ట్ర రూట్లలో ప్రయాణించే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు. ఈ మేరకు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. ఏలూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం వెళ్లే బస్సులు మొత్తం 14 ఉన్నాయి. ఈ బస్సులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల మీదుగానే వెళతాయి. ఈ బస్సుల్లో తెలంగాణ సరిహద్దుల వరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు. ప్రభుత్వం ఈ బస్సుల్లో అసలు ఉచిత ప్రయాణాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
సగం మంది మహిళలకు దూరం
ఏలూరు జిల్లా నుంచి నిత్యం ఆర్టీసీ బస్సులు 103 రూట్లలో తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కేవలం 63 రూట్లకే పరిమితం చేశారు. ఏలూరు డిపో నుంచి మొత్తం 41 రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా 23 రూట్లలో తిరిగే బస్సుల్లో మాత్రమే మహిళలకు అనుమతిస్తారు. జంగారెడ్డిగూడెం నుంచి 33 రూట్లలో తిరుగుతుండగా 22 రూట్లలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. నూజివీడు డిపో నుంచి 29 రూట్లలో బస్సులు తిరుగుతుండగా వాటిలో 18 రూట్లలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లభిస్తుంది. ఏలూరు జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సుమారు 80 వేల మంది ప్రయాణిస్తుండగా వారి లో 40 శాతం మంది అంటే సుమారు 32 వేల మంది మహిళలు ఉంటారని ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విధించిన షర తుల కారణంగా వీరిలో దాదాపు 50 శాతం అంటే 16 వేల మంది మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది.

● విద్యార్థులతో మట్టి చాకిరీ

● విద్యార్థులతో మట్టి చాకిరీ

● విద్యార్థులతో మట్టి చాకిరీ

● విద్యార్థులతో మట్టి చాకిరీ

● విద్యార్థులతో మట్టి చాకిరీ