
తాగునీటి కోసం ధర్నా
మండవల్లి: మండవల్లిలోని స్టేషన్ రోడ్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలంటూ గురువా రం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి కుళాయిల నుంచి తాగునీరు రావడం లేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సర్పంచ్, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్ని రోజులు ఓపిక పట్టాలని మహిళలు పోలీసుల వద్ద వాపోయారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా స్కూలింగ్–బిల్డింగు బ్లాక్స్ అనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి వర్క్‌షాప్ నిర్వహించారు. దేశం మొదటి స్థానంలో నిలిచే లక్ష్యంగా అన్ని రంగాల్లో నిరంతర లక్ష్యాలు, నిర్దేశం, సాధన చాలా అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధి యువత, వయోజనులు, మహిళలపై నిర్మించబడి ఉందన్నారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిలాల్లో నీటి నిర్వహ ణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబునాయుడుకి తెలియజేశారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, తదితర అంశాలపై రాష్ట్రంలోని కలెక్టర్లు, సాగునీటి సంఘాల, ప్రాజెక్ట్ సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అధికారులు హాజరయ్యారు.
చాట్రాయి: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చే రుతోంది. మండలంలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోని నీరు రిజర్వాయర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. మండలంలో 55.5 మిల్లీమీటర్ల వర్షపాత నమోదయ్యింది. 850 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని, ప్రాజెక్టు నీటిమట్టం 255 అడుగులు కాగా ప్రస్తుతం 233 అడుగులు ఉందని టీఆర్‌పీ అధికారులు తెలిపారు.
గణపవరం: మహిళలకు ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటోవాలాల పొట్ట కొట్టనుందని, ఈ పథకాన్ని వెంటనే విరమించుకోవాలని గణపవరం మండల ఆటో వర్కర్ల యూనియన్ నాయకులు గళమెత్తారు. గురువారం గణపవరం ఏరియా స్నేహ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గణపవరం, సరిపల్లె, బువ్వనపల్లి గ్రామాల్లో ఆటోలతో నిరసన ప్రదర్శనలు చేశారు. బస్టాండు నుంచి ఆటో డ్రైవర్లు నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా గణపవరం సెంటర్‌లోని మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని మానవహారంగా నిలిచారు. ఈ సందర్భంగా యూనియన్ నా యకులు మాట్లాడుతూ తాము ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించడమే గగనంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉచిత బస్సు ప్రయాణంతో జీవనం మరింత కష్టం కానుందని వాపోయారు.
భీమవరం: జిల్లాలో గురువారం ఉదయం వర కు 20 మండలాల్లో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తణుకులో 236.6 మి.మీ., అత్యల్పంగా మొగల్తూరులో 8.6 మి.మీ. వర్షం పడింది. మండలాల వారీ గా వర్షపాతం ఇలా.. తాడేపల్లిగూడెంలో 162.2 మి.మీ, పెంటపాడులో 189 మి.మీ. కురిసింది.

తాగునీటి కోసం ధర్నా

తాగునీటి కోసం ధర్నా