
వాగు ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డు
బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలోని రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దీనితో పై గ్రామాలకు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజు 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీంతో సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు పొలాలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు.