వలంటీర్లపై కూటమి కక్ష | - | Sakshi
Sakshi News home page

వలంటీర్లపై కూటమి కక్ష

Aug 15 2025 7:06 AM | Updated on Aug 15 2025 7:06 AM

వలంటీ

వలంటీర్లపై కూటమి కక్ష

అవినీతికి తావులేకుండా..

కూటమి కుట్ర

విధుల్లోకి తీసుకోవాలి

నమ్మించి మోసం చేశారు

వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ప్రజలకూ ప్రభుత్వానికి వారధిలా.. గడప ముంగిటకే సంక్షేమ పథకాలను అందించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి వలంటీర్‌ వ్యవస్థపై కక్ష కట్టింది. రూ.5 వేల జీతంతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.. తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు జీతం ఇచ్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎన్నికల్లో హామీలిచ్చారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థకు చట్టబద్ధత లేదనే సాకుతో ఒక్కసారిగా జిల్లాలో 10,800 మంది ఉద్యోగాలను తొలగించి రోడ్డున పడేశారు. వలంటీర్‌ వ్యవస్థ ఏర్పడి శుక్రవారం నాటికి ఆరేళ్లు పూర్తి కాగా వ్యవస్థ నిర్వీర్యమై ఏడాది గడిచింది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను ప్రజల ముంగిటకు అందించేలా వలంటీర్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఐదేళ్లపాటు విజయవంతంగా కొనసాగించారు. ముఖ్యంగా ఒకటో తారీఖున ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ, రేషన్‌ కార్డుల్లో పేర్లు మార్పులు, విపత్తుల వేళ సాయం వంటి సేవలతో వలంటీర్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇలా జిల్లాలో 10,800 మంది వలంటీర్లు సేవే పరమావధిగా సేవలందించారు.

రూ.3,897 కోట్ల పెన్షన్‌ పంపిణీ : జిల్లాలో ప్రతి నెలా ఒకటో తారీఖున సగటున 2.81 లక్షల మందికి సుమారు రూ.3,897 కోట్లను లబ్ధిదారులకు పెన్షన్ల కింద వలంటీర్లు పంపిణీ చేశారు. వేకువజాము నుంచి మధ్యాహ్న సమయానికి 95 శాతాన్ని పైగా పంపిణీ పూర్తిచేసేవారు. కోవిడ్‌ వంటి విప త్కర పరిస్థితుల్లో ఇంటింటా వైద్య సేవలతో పాటు వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ సాయం అందజేతలో వలంటీర్లు కీలకంగా పనిచేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారు.

వలంటీర్‌ వ్యవస్థ ద్వారా సేవలు సులభం చేయడం, అవినీతికి ఆస్కా రం లేకుండా కొనసాగిన తీరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పలు రాష్ట్రాల్లో వలంటీర్ల వ్యవస్థను అమలుచేసే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో గోదావరి వరదల సమయంలో వలంటీర్లు నూరు శాతం సేవలందించి ముంపు బాధితులకు భరోసాగా నిలిచారు. వీరి సేవలను గుర్తించి కలెక్టర్‌ సైతం సత్కరించారు.

ఎన్నికల సమయంలో వలంటీర్లను కూటమి ప్రభుత్వం నమ్మకంగా వంచించి గొంతు కోసింది. వలంటీర్‌ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని అధికారంలోకి రాగానే జీతం రూ.5 వేల నుంచి రూ. 10 వేలు పెంచు తామని ప్రకటించారు. గద్దెనెక్కి న తర్వాత వలంటీర్‌ వ్యవస్థ సరికాదని, చట్టబద్ధత లేదంటూ ఉద్యోగాలు తొలగించారు. దీనిపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వలంటీర్లు ఆందోళనలు చేసినా సర్కారు స్పందించని పరిస్థితి.

సేవకులకు వంచన

ప్రభుత్వానికీ ప్రజలకు వారధిలా పనిచేసిన వలంటీర్లు

పారదర్శకంగా పథకాల అమలుకు దోహదం

గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తామని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హామీ

అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తని కూటమి పెద్దలు

నేటితో వలంటీర్‌ వ్యవస్థకు ఆరేళ్లు

జిల్లాలో 10,800 మంది వలంటీర్ల సేవలు

‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేం అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగాల నుంచి తీయబోం. వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచే బాధ్యత నేను తీసుకుంటాను’.

– ఎన్నికల్లో చంద్రబాబు హామీ

‘వలంటీర్లు నా అక్కాచెల్లెళ్లు. ఏ రోజూ కూడా నాకు వారి పొట్టకొట్టాలన్న ఉద్దేశం లేదు. మీకు రూ.5 వేలు వస్తే.. మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే మనసున్న వాణ్ణి’.

– ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ హామీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అయితే గద్దెనెక్కిన తర్వాత వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయడంతో ఉపాధి కోల్పోయాం. వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసి ఏడాది పైబడింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం యువతకు ఉపాధి కల్పించేలా వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించాలి.

– కుచ్చులపాటి మహేష్‌, ఉప్పలపాడు, కామవరపుకోట మండలం

కూటమి నాయకులు ఎన్నికల ముందు వలంటీర్లకు అండగా ఉంటామని, జీతం రూ.10 వేలు చేస్తామని నమ్మించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లక్షలాది మంది వలంటీర్లను తొలగించారు. మాజీ సీఎం జగన్‌ వలంటీర్‌ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తే.. కూటమి నాయకులు దగా చేశారు. వలంటీర్‌ వ్యవస్థను కొనసాగించేలా కూట మి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.

– జిలానీ, కొవ్వలి, దెందులూరు మండలం

వలంటీర్లపై కూటమి కక్ష 1
1/4

వలంటీర్లపై కూటమి కక్ష

వలంటీర్లపై కూటమి కక్ష 2
2/4

వలంటీర్లపై కూటమి కక్ష

వలంటీర్లపై కూటమి కక్ష 3
3/4

వలంటీర్లపై కూటమి కక్ష

వలంటీర్లపై కూటమి కక్ష 4
4/4

వలంటీర్లపై కూటమి కక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement