ఆగిరిపల్లిలో వడగండ్ల వాన
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో గురువారం వడగండ్ల వాన కురిసింది. సుమారు గంట పాటు ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఉదయం నుంచి ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. భారీ వర్షంతో వడగండ్లు పడ్డాయి. దాదాపు రెండు గంటలపాటు విద్యుత్ అంతరాయం కలిగింది. భారీ వర్షంతో మామిడి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీపెట్ కోర్సులకు దరఖాస్తులు
నూజివీడు: విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ గురువారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), బీఎస్సీ అర్హతతో మూడేళ్ల కాలపరిమితి గల పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టింగ్ ప్రాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నా రు. సీపెట్ వెబ్‌సైట్‌లో ఈనెల 29లోపు దర ఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష జూన్ 8న నిర్వహిస్తారని తెలిపారు. 150 సీట్లు భర్తీ చేస్తా మని, మరిన్ని వివరాలకు సెల్ 9494259006 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మద్దతు ధరలు చట్టబద్ధం చేయాలి
ఏలూరు (టూటౌన్): రైతుల పంటలకు (ఎంఎస్‌పీ) మద్దతు ధరలు చట్టబద్ధం చేయాలని అ ఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎ స్) రాష్ట్ర కన్వీనర్ ఎస్‌కే గౌస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ రైతుకు కష్టకాలం వచ్చిందని, వ్యవసాయం ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వర్గాలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం తెచ్చి దేశంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటు రంగానికి ఇచ్చేందుకు పూనుకుందని మండిపడ్డారు. మిర్చి, పొగాకు, పత్తి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల 2006 సమగ్ర చట్టం ప్రకారం పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, భూమి లేని పేదలకు ఆహారం, ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నాయకులు జి.ముత్యాలరావు, ఎస్.చంద్రరావు, కె.కల్లయ్య, పి.వీరబాబు, ఎం.మల్లేష్, నార్లవరం ఎంపీటీసీ కె.రత్తమ్మ, తిరుమలపురం సర్పంచ్ ఎస్.విజయ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన సీహెచ్‌ఓల సమ్మె
ఏలూరు (టూటౌన్): తమకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని కోరుతూ జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న సీహెచ్‌ఓల నిరవధిక సమ్మె 11వ రోజైన గురువారం కొనసాగింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరంలో పెద్ద సంఖ్యలో సీహెచ్‌ఓలు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సీహెచ్‌ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పని భారం తగ్గించాలని, పీఎఫ్‌లో ప్రభుత్వ వాటా జమ చేయాలని, ఏడాదిగా నిలిచిపోయిన ఇన్సెంటివ్‌లు వి డుదల చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో ఇతర శాఖల మాదిరిగా తమకూ ప్రయోజనాలు కల్పించాలని సీహెచ్‌ఓలు కోరుతున్నారు.
బియ్యం కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
ఏలూరు(మెట్రో): నూతన బియ్యం కార్డుల జా రీతో పాటు మార్పులు, చేర్పులకు సంబంధించి మొత్తం ఆరు రకాల సేవలకు రాష్ట్ర ప్రభు త్వం అవకాశం కల్పించిందని రాష్ట్ర గృహనిర్మా ణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ప్రకటనలో తెలిపారు. కార్డులు జారీ, కార్డుల విభజన, చి రునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చే యడం వంటి సేవల కోసం సమీపంలోని సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఆధార్ సీడింగ్‌ను సరిచేసుకునే అవకాశం కల్పి ంచామన్నారు. జిల్లాలో 6,20,146 రైస్ కార్డు లు ఉండగా 17,31,461 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వీరిలో 16,15,078 మంది ఈకేవైసీ పూర్తయ్యిందన్నారు.
ఆగిరిపల్లిలో వడగండ్ల వాన


