రూ.17,785 కోట్ల అంచనాతో రుణ ప్రణాళిక
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
అకాల వర్షం రైతన్నకు నష్టాన్ని మిగిల్చింది. ఆచంట నియోజకవర్గంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. 8లో u
ఏలూరు(మెట్రో): జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల సమన్వయంతో రూపొందించిన పీఎల్‌పీని బుధవారం కలెక్టరేట్‌లో వెట్రిసెల్వి ఆవిష్కరించారు. రూ.17,785 కోట్ల అంచనాతో రుణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.11,282 కోట్లు కాగా.. ఇది మొత్తం అంచనాలో 63 శాతం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణం రూ.3,633 కోట్లగా అంచనా వేశారు. ఎగుమతుల రంగానికి రూ.147.90 కోట్లు, విద్యా రంగానికి రూ.83.70 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.534.64 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలకు రూ.46.63 కోట్లు, పునరుత్పాదక శక్తికి రూ.12.70 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1106.09 కోట్లగా అంచనా వేశారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం టి.అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో గురుకుల
ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్స్
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ ప్రవేశానికి మే నెల 4న పరీక్ష నిర్వహిస్తుందని వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్స్ సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నా యని తెలిపారు. వెబ్‌సైటు నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని మే నెల 4న ఉదయం 9 గంటలకు పరీక్షకు హాజరు కావాలని కోరారు.


