ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని మోదేలు గ్రామంలో నివసిస్తున్న 30 కుటుంబాల కొండరెడ్డి గిరిజనులు ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బుధవారం పీఆర్‌గూడెంలో పర్యటిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ పార్టీ నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ మోదేలు గ్రామానికి రహదారి నిర్మాణానికి, కరెంట్ సదుపాయానికి నిధులు మంజురైనప్పటికీ ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాల మేరకు నిలిచిపోయాయని తెలిపారు. అలాగే ప్రధాన మంత్రి యోజన పథకంలో 27 ఇళ్లు మంజూరయ్యాయని అవి కూడా ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో నిలిచిపోయాయని తెలిపారు. పీడీఎస్‌యూ నాయకులు ఈ. భూషణం, బి. వినోద్ పాల్గొన్నారు.
హస్తకళలను పరిశీలించిన మంత్రి
బుట్టాయగూడెం మండలంలో రెండో రోజు పర్యటించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం పులిరామన్నగూడెంను సందర్శించారు. గ్రామంలోని వెదురు హస్తకళా తయారీ కేంద్రాన్ని సందర్శించి గిరిజన మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్లకు న్యూడెమోక్రసీ నాయకుల వినతి


