ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్‌టీఆర్ వైద్య సేవ ఆరోగ్య మిత్రలు సోమవారం నిరసన తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆరోగ్యమిత్ర డీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపి జిల్లా సమన్వయకర్తకు వినతి పత్రం అందజేశారు. శాంతియుతంగా విధుల బహిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
చేనేతలను ఆదుకోవాలని..
రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
కౌలు రైతుల సమస్యలపై : కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇవ్వండి లేదా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అయిన అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
గళమెత్తిన స్కూల్ స్వీపర్లు
స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్లకు జీఓ నం.7 ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇవ్వాలని, స్కూల్ స్వీపర్లకు యూనిఫాం, గ్రూప్ ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ అమలు చేయాలని కోరుతూ స్కూ ల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు, వేలూరుపాడు, ముదినేపల్లి, పెదపాడు మండలాలకు చెందిన స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు .
మిన్నంటిన నిరసనలు


