ఏలూరు(మెట్రో)/ ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సమస్యల పరిష్కారంలో విఫలమైంది. సమస్యలు పట్టి పీడిస్తున్నా పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం కార్యక్రమం పేరు మార్చడంలో చూపిన శ్రద్ధ సమస్యల పరిష్కారంలో చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఫిర్యాదుల స్వీకరణపైనే దృష్టి సారించిన కూటమి సర్కారు సమస్యల పరిష్కరానికి క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమీక్షా సమావేశాల నిర్వహణలో చూపడం లేదు. దీంతో ఫిర్యాదుల పరిష్కారం కోసం అర్జీదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
సోమవారం.. సమస్యలు అనేకం
ప్రతి సోమవారం బాహాటంగా నిర్వహిస్తున్న పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమానికి 318 ఫిర్యాదులు వచ్చాయంటే సమస్యల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
సచివాలయాల నిర్వీర్యంతో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో సచివాలయాల వద్దకు వెళ్లేందుకు ప్రజలు విముఖత చూపుతున్నారు. సచివాలయాలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ఉద్యోగులపై భారం మోపడంతో పాటు ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయడం లేదు.
మూడు నెలల్లో 1,845 ఫిర్యాదులు
జిల్లావ్యాప్తంగా గత మూడు నెలల్లో 1,845 ఫిర్యాదులు రాగా 712 అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. 1,125 అర్జీలను పరిష్కరించామని అధికారులు చెబుతున్నా అవి కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదనే వాదన వినిపిస్తోంది.
318 అర్జీలు : ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌కు ప్రజలు పోటెత్తారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్‌తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 318 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు.
తన కుమారులు చూడటం లేదంటూ రోదిస్తున్న అమ్మపాలేనికి చెందిన వెంకటాయమ్మ
ప్రతి వారం వినతుల వెల్లువ
పరిష్కారానికి నోచుకోని ఫిర్యాదులు
పేరు మార్పుతో సరిపెట్టిన కూటమి ప్రభుత్వం
పింఛన్, భూసమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు
విలపింఛెన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయి 10 నెలల నుంచి పెన్షన్ కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు ఇదొక దివ్యాంగుడి ఆవేదన.. కొత్త పెన్షన్లు ఏమో గాని ఉన్న పెన్షన్లు ఎందుకు తీసేశారో తెలియడం లేదు.. న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చా ఇదొక వృద్ధురాలి వేదన.. ఇలా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల్లో ఎక్కువ శాతం పింఛన్ దరఖాస్తులే ఉంటున్నాయి. సోమవారం ‘సాక్షి’ బృందం ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎక్కువ మంది పెన్షన్‌తో పాటు భూసంబంధిత సమస్యలపై అర్జీలు అందించారు. రెండు నెలలుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయిన ఈ కార్యక్రమం రెండు వారాల నుంచి యథావిధిగా జరుగుతోంది.
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !


