ఐపీఎస్‌కు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ | - | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌కు ఎంపికైన ఏలూరు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్

Aug 1 2024 2:28 AM | Updated on Aug 1 2024 12:06 PM

-

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రత్యూష గత ఏప్రిల్‌లో విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 198 ర్యాంకు సాధించగా.. తాజాగా ఐపీఎస్‌ శిక్షణకు రావాలంటూ ఉత్తర్వులు అందాయి. గతంలో గ్రూప్‌–1లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 

ఐపీఎస్‌కు ఎంపికవడంతో ఆగస్టు 26 నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. సిసలికి చెందిన గణేశ్న వెంకట రామాంజనేయులు, ఉషా దంపతుల కుమార్తె ప్రత్యూష మొదట నుంచి చదువుపై ఆసక్తితో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కష్టపడి చదివింది. ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్‌–1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అనంతరం ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement