
ఈనెల 24 రాత్రి చినవెంకన్న తెప్పోత్సవానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరిణి మధ్యలోని మండపాన్ని, పరిసరాలను, తెప్పను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. IIలో u
వలలో కొండచిలువ
కలిదిండి మండలం సానారుద్రవరంలో చేపల చెరువులో 10 అడుగుల కొండచిలువ వలకు చిక్కింది. ఫారెస్టు సిబ్బంది అటవీ కార్యాలయానికి తరలించారు. IIలో u
మంగళవారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2023
● శివోహం
ఉమ్మడి పశ్చిమగోదావరిలోని శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భీమవరం ఉమాసోమేశ్వర జనార్థన స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం, పట్టిసం వీరభద్రస్వామి క్షేత్రం, ఆచంటేశ్వర స్వామి ఆలయాలను వేలాది మంది దర్శించుకున్నారు. స్వామికి మహన్యాస పూర్వక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక నోములు నోచుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
న్యూస్‌రీల్

పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రంలో వీరభద్రస్వామికి అభిషేకం చేస్తున్న దృశ్యం

భీమవరం(ప్రకాశంచౌక్): భీమవరం ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో స్వామికి అభిషేకం

పెనుగొండ: ఆచంటలో ఆచంటేశ్వరుడికి అభిషేకం

ఆర్థిక సాయం చెక్కు అందిస్తున్న డీఆర్వో