
కొండచిలువను చూపుతున్న కై కలూరు అటవీశాఖ సిబ్బంది
కై కలూరు: కలిదిండి మండలం సానారుద్రవరంలో చేపల చెరువులో సంచరిస్తున్న 10 అడుగుల కొండచిలువ ఆదివారం వలకు చిక్కింది. రైతులు దానిని సంచిలో బందించి కలిదిండి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, సిబ్బంది కై కలూరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు సిబ్బంది టి.సురేష్, వై.సౌజన్యకుమార్ వెళ్లి కొండచిలువను కై కలూరు అటవీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఫారెస్టు డెప్యూటీ రేంజర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ కొండచిలువను ఇండియన్ రాక్ ఫైథాన్ అంటారన్నారు. సుమారు 8–9 నెలల వయస్సు ఉంటుందన్నారు. జంగారెడ్డిగూడెం అటవీప్రాంతంలో దీనిని సురక్షతంగా విడిచిపెడతామన్నారు. కొండచిలువలు విషసర్పాలు కాదని, ఆకారం పెద్దగా ఉండటంతో కొట్టి చంపుతున్నారన్నారు. ఎక్కడైనా కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.