తమ్ముడు కాకపోయినా తలకొరివి | - | Sakshi
Sakshi News home page

తమ్ముడు కాకపోయినా తలకొరివి

Jan 4 2026 11:04 AM | Updated on Jan 4 2026 11:04 AM

తమ్ముడు కాకపోయినా తలకొరివి

తమ్ముడు కాకపోయినా తలకొరివి

పాలకొల్లు సెంట్రల్‌: పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను (45) అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందాడు. బంధువులు ఉన్నా ఎవరింటికీ వెళ్లడు. పొరుగున ఉండే పతివాడ మావుళ్లమ్మను అక్కా అని పిలిచేవాడు. ఆ అనుబంధంతో ఆమె తలకొరివి పెట్టింది. తాను ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసి వయసు మీదపడడంతో మానేశానని.. శ్రీనును ఇంటి వద్దే పెట్టుకుని చూసుకునేదాన్నని మావుళ్లమ్మ తెలిపింది. శ్రీనుకు ఇద్దరు అక్కలున్నట్లు సమాచారం. శనివారం శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యలుకు సమాచారం ఇచ్చినా రాలేదని.. తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే పెట్టినట్లు ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement