కమ్మేసిన పొగమంచు | - | Sakshi
Sakshi News home page

కమ్మేసిన పొగమంచు

Jan 4 2026 11:04 AM | Updated on Jan 4 2026 11:04 AM

కమ్మే

కమ్మేసిన పొగమంచు

భీమడోలు: జాతీయ, రాష్ట్ర రహదారులను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరడంతో మంచు కురిసి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 9 గంటలైన మంచు తెరలు వీడనే లేదు. భీమడోలు బస్టాండ్‌ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. రహదారులపై మంచు కమ్ముకోవడంతో రహదారులు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు మంచులో తిరగవద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

కమ్మేసిన పొగమంచు 1
1/1

కమ్మేసిన పొగమంచు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement