కేంద్రంతో అమీతుమీ

సన్నాహక సభలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ 
 - Sakshi

ఏలూరు రూరల్‌: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఏలూరులో జరిగిన ఎమ్మార్పీఎస్‌ ముఖ్య నాయకుల సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్గీకరణపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్నారు. ఎన్నో ఏళ్లగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణం అన్నారు. వర్గీకరణ సాధిస్తేనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి 58 ఉపకులాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి 13 జిల్లాల సమన్వయకర్తలు ముమ్ముడి చిన్న సుబ్బారావు, కందుల రమేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనగలశేఖర్‌, కాశీకృష్ణ, గద్దల ప్రసాద్‌, నమ్మిన లక్ష్మీ, కూచిపూడి మహేష్‌, అయినపర్తి మాధవరావు, చాట్ల సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top