బ్లాక్‌లో ర్యాపిడ్‌ కిట్లు

Rapid Kits Sales In Block Market - Sakshi

యాంటిజెన్‌ కిట్‌ ధర రూ.500.. బ్లాక్‌లో రూ.800పైనే

అక్రమంగా కొంటున్న క్లినిక్‌లు, ప్రైవేట్‌ లేబొరేటరీలు

అనుమతి లేకున్నా బాధితులకు అనధికారిక పరీక్షలు

సులువైన పరీక్ష, తక్షణమే ఫలితంతో భారీ డిమాండ్‌

శాంపిల్‌ సక్రమంగా తీయకపోతే ఫలితం తారుమారే

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. హైదరా బాద్‌ నుంచే కొన్ని కంపెనీల డీలర్ల ద్వారా క్లినిక్‌లకు, ల్యాబ్‌లకు, చివరకు వ్యక్తి గతంగా కొందరి చేతుల్లోకి చేరుతు న్నాయి. ఆపై వీటిని ‘బ్లాక్‌’ చేస్తూ, వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వా స్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుం డదన్న భావనతో చాలామంది యాంటిజెన్‌ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్‌ పెరిగి బ్లాక్‌ అవుతున్నాయి. ఇది జిల్లా వైద్యాధికారుల దృష్టికొచ్చినా పట్టించు కోవట్లేదనే ఆరోపణలున్నాయి.

ర్యాపిడ్‌ టెస్టులకు ప్రైవేట్‌లో అనుమతే లేదు
తెలంగాణలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు, లేబొరేటరీలకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కేవలం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేసేందుకే  23 ప్రైవేట్‌ లేబొరేటరీలకు, కొన్ని ఆసుపత్రులకు అనుమతి ఉంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాల వెల్లడికి ఒక్కోసారి వారం వరకు సమయం పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, లేబొరేటరీలకు కేంద్రం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులకు అనుమతినిచ్చింది. దీనిద్వారా కరోనా నిర్ధారణ అరగంటలోపే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వరకు వందలాది కేంద్రాల్లో ప్రభుత్వమే యాంటిజెన్‌ టెస్టులు చేస్తోంది. పైగా ఈ టెస్టు చేయడం చాలా తేలిక. గొంతు లేదా ముక్కులోంచి స్వాబ్‌ నమూనాలు తీసి, సంబంధిత ద్రావణంలో ముంచి కిట్టుపై పెడితే నిమిషాల్లో పాజిటివా? నెగెటివా? అనేది తెలుస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లకు కొన్ని కంపెనీలు డీలర్ల ద్వారా అక్రమంగా కిట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి. జిల్లాల్లోని చాలా ప్రైవేట్‌ క్లినిక్‌లు, లేబొరేటరీలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారు. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేసే కొన్ని ల్యాబ్‌లు, ఆసుపత్రులు గుట్టుగా యాంటిజెన్‌ టెస్టులు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నాయి.

ఆచితూచి యాంటిజెన్‌ టెస్ట్‌
ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లో శాంపిళ్ల సేకరణ కీలకం. గొంతు/ముక్కులోంచి స్వాబ్‌ నమూనా సరిగా తీయకుంటే ఫలితం తారుమారవుతుంది. శిక్షణ కలిగిన టెక్నీషియన్లు మాత్రమే స్వాబ్‌ నమూనాలు తీయాలి. తీసిన శాంపిళ్లను గంటలోపే పరీక్షించాలి. లేదంటే ఆ శాంపిల్‌ పనికిరాదు. కొందరైతే ఇళ్లలో తామే స్వాబ్‌ తీసుకొని పరీక్షించుకుంటున్నారు. ఇదింకా ప్రమాదకరం. దీనివల్ల ఫలితం తారుమారయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇక యాంటిజెన్‌ టెస్ట్‌కు ఉన్న ప్రధాన లోపం నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతమే. పాజిటివ్‌కు మాత్రమే కచ్చితత్వం ఉంది. నెగెటివ్‌ వచ్చి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయాలన్నది ఐసీఎంఆర్‌ కీలక నిబంధన. కానీ నెగెటివ్‌ వచ్చిన చాలామంది లక్షణాలున్నా కూడా తమకు వైరస్‌ సోకలేదంటూ జనంలో తిరిగేస్తున్నారు. దీంతో వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 

వరంగల్‌కు చెందిన జయరాం.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కరకొస్తుందని భావించి తనకు తెలిసిన ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ యజమాని వద్ద నాలుగు యాంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కొన్నాడు. వాటి వాస్తవ ధర ఒక్కోటి రూ. 500 కాగా రూ. 800 చొప్పున వెచ్చించాడు.

హైదరాబాద్‌లో క్లినిక్‌ నడిపే డాక్టర్‌ రఘురామయ్య (పేరు మార్చాం).. కరోనా లక్షణాలతో క్లినిక్‌కు వస్తున్న వారికి తన టెక్నీషియన్‌ ద్వారా స్వాబ్‌ శాంపిల్‌ తీసి పరీక్షలు చేయిస్తున్నాడు. బ్లాక్‌లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లను కొని ఒక్కో పరీక్షకు రూ.1,500 తీసుకుంటున్నాడు. పావుగంటకే ఫలితం వస్తుండటంతో జనం ఎగబడుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి...
08-05-2021
May 08, 2021, 04:39 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 04:16 IST
కోవిడ్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్‌ చేశారు. అక్కడి...
08-05-2021
May 08, 2021, 04:02 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
08-05-2021
May 08, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు...
08-05-2021
May 08, 2021, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన...
08-05-2021
May 08, 2021, 03:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు...
08-05-2021
May 08, 2021, 03:26 IST
సాక్షి, అమరావతి:  జిల్లా స్థాయిలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన...
08-05-2021
May 08, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల...
08-05-2021
May 08, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు...
08-05-2021
May 08, 2021, 03:09 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది....
08-05-2021
May 08, 2021, 03:08 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని,...
08-05-2021
May 08, 2021, 03:06 IST
కౌలాలంపూర్‌: మలేసియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు...
08-05-2021
May 08, 2021, 02:53 IST
ముంబై: ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే....
08-05-2021
May 08, 2021, 01:22 IST
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ...
08-05-2021
May 08, 2021, 01:21 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన...
08-05-2021
May 08, 2021, 00:43 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌: కోవిడ్‌–19పై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది...
08-05-2021
May 08, 2021, 00:42 IST
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్‌ ఉంటే...
07-05-2021
May 07, 2021, 21:58 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌...
07-05-2021
May 07, 2021, 20:57 IST
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్‌ వేవ్‌ను  తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన  కేంద్ర ప్రభుత్వ అత్యున్నత...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top