నగర పాలకులు ఎవరో? | - | Sakshi
Sakshi News home page

నగర పాలకులు ఎవరో?

Nov 26 2026 12:48 AM | Updated on Nov 26 2026 12:48 AM

బ్యాలెట్లను పరిశీలిస్తున్న కమిషనర్‌ రాహుల్‌ మీనా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ క్షితిజ్‌ ఆదిత్య శర్మ

పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు

సిద్ధమైన ఎన్నికల సిబ్బంది

రాజమహేంద్రవరం సిటీ: కార్పొరేషన్‌ పోరుకు రంగం సిద్ధమైంది. అమీతుమీ తేల్చకునేందుకు వైఎస్సార్‌ సీపీ, కూటమి పార్టీలో రంగంలోకి దిగాయి. గురువారం నగర పోరుకు అధికారులు అన్ని విధాలా చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ మేయర్‌తోపాటు 70 డివిజన్లలో (రెండు డివిజన్లు ఏకగ్రీవం) కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎన్నికలకు 494 పోలింగ్‌ బూత్‌ లను ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజనగరం నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ అధికారులు సామాగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ముందుగా బుధవారం నగరంలోని కందుకూరి వీరేశలింగం స్కూల్లో ఎన్నికల సామగ్రిని అందించే కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్‌ అనంతరం ఈ నెల 30న ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు 28 మంది రిటర్నింగ్‌ అధికారులు, 31 మంది అసిసెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 593 మంది ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 593 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 2,371 మంది అదర్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, 26 మంది జోనల్‌ అధికారులు, 24 మంది రూట్‌ ఆఫీసర్లు, 65 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

ఎన్నికల పరిధిలో 199 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి 65 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కమిషనర్‌ రాహుల్‌ మీనా వెల్లడించారు. పోలీసు సిబ్బందితో కలిపి సుమా రు 10 వేల మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులను అత్యంత భద్రత నడుమ కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రానికి తిరిగి తీసుకువచ్చి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

పోలింగ్‌ కేంద్రాలు : 494

మొత్తం ఓటర్లు : 4,63,322 మంది

పురుషులు : 2,23,637

మహిళలు : 2,39,615

ఇతరులు : 70 మంది

ఫ నేడు రాజమహేంద్రవరం

కార్పొరేషన్‌ పోలింగ్‌

ఫ 30న ఓట్ల లెక్కింపు

ఫ ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు

ఫ పూర్తయిన ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement