జాతీయ క్రికెట్ టోర్నీకి
యాదవోలు విద్యార్థినులు
దేవరపల్లి: యాదవోలు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినులు ఎం.సంజన, సీహెచ్ షణ్ముఖ ప్రియ, ఆర్.బిందుమాధవి, పి.శ్రీప్రియ జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీమెంట్‌కు ఎంపికయ్యారు. జమ్మూకాశ్మీర్‌లో డిసెంబరు 1 నుంచి 4వ తేదీ ఈ పోటీలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జి.జ్యోతి నెల్లూరులో నిర్వహించిన సబ్ జూనియర్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లా జట్టుకు ప్రథమస్థానం లభించిందని, ఆ జట్టులో తమ విద్యార్థినులు ప్రతిభ చూపారన్నారు.
రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ విజేతగా రాయవరం విద్యార్థి
రాయవరం: స్థానిక రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి టి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి నెట్‌బాల్ రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచాడు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీత బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంతో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ప్రతిభను పలువురు అభినందించారు. అతడికి శిక్షణనిచ్చిన పీడీలు అజ్జిబాబు, శ్రీనివాస్‌లను ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, పోలిశెట్టి రాంబాబు, ఎంపీపీ వుండవిల్లి రాంబాబు, స్కూల్ చైర్మన్ పట్నాల జగదీష్, ఉపాధ్యాయులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగిలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. లబ్బర్తి గ్రామానికి చెందిన మర్రి బుల్లయ్య(53) స్వగ్రామం నుంచి జగ్గంపేటకు మోటారు సైకిల్‌పై బయలు దేరాడు. జడ్డంగి సమీపానికి వచ్చే సరికి కుక్క అడ్డురావడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలైన అతడిని స్థానికులు వెంటనే జడ్డంగి పీహెచ్‌సీకు తరలించారు. డాక్టర్ నాగార్జున ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఏలేశ్వరం సీహెచ్‌సీకు రిఫర్ చేశారు. అక్కడకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బుల్లయ్య మృతి చెందాడని ఎస్సై చినబాబు తెలిపారు.
బింధుమాధవి
షణ్ముఖ ప్రియ
శ్రీప్రియ
సంజన


