తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో కోరంగి సుబ్బారాయుని దిమ్మ సమీపంలో ఆదివారం రాత్రి బొలేరో వాహనం బైక్‌ను ఢీకొని పక్కనే ఉన్న రెయిలింగ్‌పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కాకినాడ కొండయ్యపాలెం గ్రామానికి చెందిన ముర్రే రాజుకు తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు జాన్ స్వల్పంగా గాయపడ్డారు. కాజులూరు మండలం నామవానిపాలెం వెళ్లి తిరిగి కాకినాడ వస్తున్న వారిని ఎదురుగా ఐస్ క్యాన్లతో వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొంది. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
పశువుల పాక దగ్ధం
రావులపాలెం:గోపాలపురంలో ప్రధాన రహదారిని ఆనుకున్న పొలంలోని గేదెల పాక ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకోవడంతో కాలిపోయింది. పక్కనే ఉన్న గడ్డిమేటు కూడా దగ్ధమైంది. పాకలోని రెండు గేదెలు, ఆవు, దూడ, ఐదు మేకలు పాక్షికంగా మంటల్లో కాలిపోయాయి. వాటిలో రెండు గేదెలు 80 శాతం మేర కాలిపోయినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. గేదెల పాకలో దోమలు పోవడానికి పెట్టిన పొగ కారణంగా మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగి నట్టు స్థానికులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్టు రైతు కాగితపు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
25ఆర్వీపీ07:
దగ్ధమైన పశువుల పాక


