నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఆదివారం నిర్వహించిన ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 14, 16 విభాగంలో నిర్వహించిన ఎంపికలను అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఎంపిక కమిటీ సభ్యులుగా పీవీ ప్రసాద్ రెడ్డి, ఎం.వెంకటేష్, ఎంఏ సునయన, కె.రమణ వ్యవహరించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలంగాణలో నవంబర్ 14 నుంచి 16 వరకు జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ జాతీయ స్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరయ్యారన్నారు. అండర్ 14లో 4, అండర్ 16లో 9 మందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ పోటీలలో విజేతలకు సీహెచ్ జితేంద్ర పతకాలు అందజేశారు. కోచ్‌లుగా అఖిల్, దీపిక వ్యవహరించారు. సచిన్ జైన్ స్పోర్ట్స్ కిట్, టీషర్టులు సమకూర్చారు. ఎంపికల నిర్వహణకు డీఎస్‌ఏ అథ్లెటిక్స్ కోచ్ ప్రవీణ్, వీరబాబు సహకారం అందించారు.


